ఆరోగ్య సంరక్షణ ఇక మీ ఇంటి వద్దకే!
అమ్మానాన్నలకు తోడుగా, పసిపాపకు ప్రేమగా, ఆపరేషన్ తర్వాత కోలుకునే వరకు అండగా — శిక్షణ పొందిన కేర్గివర్లు, నర్సులు, ఫిజియోథెరపిస్టులు మీ ఇంటికే వచ్చి చూసుకుంటారు.
కాల్ చేయండి: +91 81218 01400 · WhatsApp
Vitacure ఏ ఏ ప్రాంతాల్లో సేవలు అందిస్తుంది?
మా టీమ్ వరంగల్‌లోనే ఉంది. హనుమకొండ, వరంగల్, కాజీపేటలోని కుటుంబాలకు సేవలు అందిస్తున్నాం. తెలంగాణలోని మిగతా ఊళ్లకూ హోమ్ కేర్ ఏర్పాటు చేస్తాం — మాకు కాల్ లేదా వాట్సాప్ చేయండి, బుక్ చేసే ముందే మీ ఊళ్లో కేర్‌గివర్ దొరుకుతారో చెబుతాం.
ఇంటి దగ్గర ఎలాంటి సేవలు బుక్ చేసుకోవచ్చు?
వృద్ధుల సంరక్షణ, పసిపిల్లల సంరక్షణ, ఇంటి దగ్గరే నర్సింగ్, ఫిజియోథెరపీ, ఆపరేషన్ లేదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక సంరక్షణ. ప్రతి సేవ, ప్రతి ప్యాకేజీ ధరతో సహా బుక్ చేసే ముందే వెబ్సైట్లో చూడవచ్చు.
ఖర్చు ఎంత అవుతుంది?
మీరు ఎంచుకునే సేవ, ఎన్ని రోజులు కావాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. ప్రారంభ ధరలు హోమ్‌పేజీలో, సేవల పేజీలో ఉన్నాయి. బుక్ చేసేటప్పుడు ప్రతి ప్యాకేజీ ధర కనిపిస్తుంది. సంరక్షణ మొదలయ్యే ముందే మా టీమ్ ఫైనల్ ధర మీతో మాట్లాడి ఖరారు చేస్తుంది.
మీ కేర్గివర్లను నమ్మవచ్చా?
నిశ్చింతగా నమ్మవచ్చు. ప్రతి కేర్‌గివర్ నేపథ్యాన్ని తనిఖీ చేసి, మా టీమ్ ఓకే చేశాకే ఏ కుటుంబానికైనా పంపిస్తాం.
డబ్బులు ఎలా చెల్లించాలి?
బుక్ చేసేటప్పుడే ఆన్లైన్లో (UPI, కార్డులు వగైరా) చెల్లించవచ్చు. లేదా మా టీమ్‌కు క్యాష్‌గా గానీ, UPIలో గానీ ఇవ్వవచ్చు.
ఫోన్లో, వాట్సాప్‌లో బుక్ చేయవచ్చా?
తప్పకుండా. +91 81218 01400కు కాల్ లేదా వాట్సాప్ చేయండి — మా టీమే మీ తరఫున బుక్ చేస్తుంది. కావాలంటే వెబ్సైట్లో, Vitacure యాప్‌లో మీరే స్వయంగా బుక్ చేసుకోవచ్చు.
Vitacure Healthcare Private Limited, 11-24-212, Pochamma Maidan, Warangal, Telangana 506002